calender_icon.png 17 December, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్లు సమాజసేవలో పాల్గొనాలి: బోళ్ల వెంకటరెడ్డి

17-12-2025 06:25:59 PM

నకిరేకల్ (విజయక్రాంతి): పెన్షనర్లు విశ్రాంత సమయంలో సమాజసేవలో చురుగ్గా పాల్గొనాలని డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్‌లోని పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ సంఘం కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోళ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే నకిరేకల్ పెన్షనర్స్ సంఘం విశిష్ట సేవలు అందిస్తోందని ప్రశంసించారు.

ప్రతి పెన్షనర్‌కు సంఘం అండగా ఉంటూ భరోసా కల్పిస్తోందని అన్నారు. సమాజాభివృద్ధిలో పెన్షనర్ల అనుభవం, సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరమల్ల రవీందర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ పుచ్చకాయల వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు మారపాక నరసయ్య, సమన్వయకర్తలు జటావత్ జవహర్లాల్ నాయక్, పల్లె శ్రీనివాస్ గౌడ్, కనుకుల బిక్షం రెడ్డి తదితరులు హాజరయ్యారు.