calender_icon.png 17 December, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంపెల్లి కనకేష్ పటేల్ ను కలిసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు

17-12-2025 06:34:26 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ మండలంలో రెండవ విడత డిసెంబర్ 14వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికలలో పాల్వంచ మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ జర్పుల సంధ్య, ఉప సర్పంచ్ వేముల నరేష్, వార్డు మెంబర్లు పసల దుర్గ, పసల భాస్కర్, అన్నం మంజుల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికలలో వారి గెలుపుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా వారితో కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ ఈ పంచాయతీ ఎన్నికలలో సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, ముగ్గురు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటారని, భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో ఈ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చేలా కృషి చేయాలని, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ గ్రామ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని, గ్రామంలోని సమస్యలను ఏ పార్టీకి చెందిన వారు తెలియజేసిన వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ జర్పుల సంధ్య, ఉప సర్పంచ్ వేముల నరేష్ లు మాట్లాడుతూ తాము గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందించిందని, పార్టీ సహాయ సహకారాల వల్లనే తాము సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ పదవులను కైవసం చేసుకున్నామని, తాము ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ తమ గ్రామ పంచాయతీలోని పలు సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని, తమ గెలుపుకు సహకరించిన మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ బాద్యులు వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్ర రావు పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నం ప్రభాకర్, వేముల ఐలయ్య, తోటలోహి సాయి, సత్యనారాయణపురం గ్రామస్తులు పాల్గొన్నారు.