21 March, 2026 | 11:29 PM

శ్రీనగర్‌లో గ్రనేడ్స్‌తో ఉగ్రదాడి

04-11-2024 12:54 AM

12 మందికి తీవ్ర గాయాలు

శ్రీనగర్, నవంబర్ 3: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రదాడి జరిగిం ది. లాల్‌చౌక్ ఏరియాలోని ఆదివారం సంత(సండే మార్కెట్)లో టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్(టీఆర్‌సీ)పై లష్కరే తోయిబా ఉగ్రవాదులు గ్రనే డ్లు విసిరారు.  ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికి త్స  కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సంతకు భారీగా జనం హాజరుకావడంతో రద్దీ నెలకొంది.

ఈ సమయంలోనే ఉగ్రవా దులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. లష్కరే అగ్ర కమాండర్ ఉస్మాన్‌తో పాటు ముగ్గరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు శనివారం ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టిన తర్వాత రోజు దాడి జరగడంతో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.