22 March, 2026 | 12:49 AM

చెరువులోకి దూసుకెళ్లిన కారు

04-11-2024 12:53 AM

8 మంది దుర్మరణం

రాయ్‌పూర్, నవంబర్ 3: ఛతీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది చని పోయారు. లరిమా నుంచి సూరజ్‌పూర్ వెళుతుండగా శనివారం అర్ధ రాత్రి బుధాబాగీచా మెయిన్ రోడ్డు పై  మలుపు తిప్పేటప్పుడు వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయా రు. డ్రైవర్‌తోపాటు మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. మృతుల్లో ఓ మహిళ, మరో చిన్నారి ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని కారును చెరువు నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.