31 May, 2026 | 6:46 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

టెట్ హాల్ టికెట్లు విడుదల

28-12-2025 01:13 AM

సుదూర ప్రాంతాల్లో సెంటర్ల కేటాయింపు

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): టెట్ హాల్‌టికెట్లను విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉం టాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గమల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. అయితే ఉదయం సెషన్‌కు 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌కు 12.30 గంటలకు పరీక్షా హాలులోకి అభ్యర్థులను అనుమతిస్తారు. హాల్‌టికెట్ వెనుకాల ఉన్న సూచనలను అభ్యర్థులు పాటించాలని అధికారులు తెలిపారు.

పేపర్1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 97 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి సెంటర్లను పెంచారు. ఫిబ్రవరి 10 తేదీల మధ్య ఫలితాలను వెల్లడించనున్న సంగతి తెలిసిందే. టెట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తమ సొంత జిల్లా, తర్వాత పక్క జిల్లాల కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు సెంటర్లను ఆప్షన్లుగా పెట్టుకున్నారు. 200 కి.మీ. దూరం నుంచి 450 కి.మీ. దూరంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు వాపోయారు. దీంతో తా ము ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఉదాహరణకు నిర్మల్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఇలా కేటాయించారు.