l పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో..
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్ మారే అవకాశం ఉంది. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పోలింగ్ రోజు, దాని ముందు రోజు టెట్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. అంటే మే 26, 27 రెండు రోజులు పరీక్షలు ఉండవని సమాచారం. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. అయి తే మే 27న ఎమ్మెల్సీ పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా గ్రాడ్యుయేట్లే ఉంటారు. వీరంతా పోలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ పరీక్ష నిర్వహిస్తే ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారు. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్ మార్పుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేవలం రెండు రోజులు మార్చుతారా.. లేకుంటే మొత్తం షెడ్యూలే మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాల్సి ఉంది. షెడ్యూల్ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.