30 July, 2026 | 8:40 AM

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

24-06-2024 03:07 PM

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఒకేసారి ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 2,54,498 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సప్టిమెంటరీ పరీక్షలో 1.63 లక్షల మంది విజయం సాధించగా.. 63.86 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 18,913 మంది విద్యార్థులు హాజరుకాగా.. ఒకేషనల్ విద్యార్థుల్లో 53.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,38,477 మంది విద్యార్థులు హాజరుకాగా.. 43.77 శాంత మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 15,137 మంది విద్యార్థులు హాజరు కాగా.. 51.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వివరించారు. ఇంటర్మీడియట్ సప్టిమెంటరీ ఫలితాల కోసం tgbie.cgg.gov.in., http://results.cgg.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.