బీఆర్ఎస్ ఖతం అయ్యింది: షబ్బీర్ అలీ
బీఆర్ఎస్ భూములను వేలం వేయాలి: షబ్బీర్ అలీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికను బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గతంలో బీఆర్ఎస్ చేర్చుకోలేదా..? శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా..? శాసనమండలిలో తన ప్రతిపక్ష నేత హోదా మీరు తొలగించలేదా..? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యాలయం ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. కొకపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ కు ఇచ్చిన భూములు వేలం వేసి, వచ్చిన డబ్బలను రుణమాఫీకి ఉపయోగించాలని షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖతం అయ్యిందని ప్రభుత్వ సలహాదారు పేర్కొన్నారు.






