calender_icon.png 14 June, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకాల్లో సమస్యలకు టీజీపీఎస్సీతో పరిష్కారం

13-06-2025 02:24:32 AM

టీజీపీఎస్సీ, నల్సార్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలకు టీజీపీఎస్సీతోనే పరిష్కారం లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ), నల్సార్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..

చట్టపరమైన సవాళ్ల పరిష్కారానికి ఈ విధమైన వర్క్‌షాపులు ఎంతో దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూపీఎస్సీ చైర్మన్ అజయ్‌కుమార్, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, నల్సార్ వీసీ కృష్ణదేవరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ..పీఎస్సీ కార్యకలాపాల్లో ఏఐని వినియోగించడం ద్వారా సవాళ్లను తగ్గించడంతోపాటు సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ..ఈ వర్క్‌షాప్ ద్వారా ఆయా పీఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.