23 May, 2026 | 3:10 PM

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్

23-05-2026 02:13 PM

గ్రామానికి వైకుంఠ రథం అందజేత

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామానికి వైకుంఠ రథాన్ని అందజేస్తానని గ్రామ ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన, ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి వైకుంఠ రథాన్ని చేయించి అందించారు. గ్రామంలోని పేద ప్రజలు మరణించిన సమయంలో వారి అంతిమయాత్రలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ రథాన్ని వినియోగిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సమీర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.