23 May, 2026 | 2:52 PM

Breaking News

ఏఐసీసీ దృష్టిలో బెస్ట్ పీసీసీ తెలంగాణ   •   నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •  

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

23-05-2026 02:19 PM

తంగళ్ళపల్లి మే 23 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరాల గ్రామానేరెళ్ళ గ్రామంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల & జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ బోధనా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి. రాధ తెలిపారు. కళాశాల విభాగంలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే పాఠశాల విభాగంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తెలుగు, హిందీ, గణితశాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు బి.ఎస్‌సి నర్సింగ్ లేదా ఎం.ఎస్‌సి నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.

సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు బి.ఎడ్ పూర్తి చేసి టెట్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు డెమో నిర్వహించి, వారి బోధనా నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. బోధనా అనుభవం కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధృవీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డుతో నేరుగా నేరెళ్ళలోని కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల సమర్పణకు మే 30 చివరి తేదీ అని తెలిపారు. ఇతర వివరాల కోసం పాఠశాల పనివేళల్లో కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.