23 May, 2026 | 3:10 PM

వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్

23-05-2026 02:11 PM

- వినియోగదారుల సౌకర్యార్థం 28 ఫీచర్లు

- ఇంటి నుంచే అన్ని సేవలు - ఎస్ఈ

మంచిర్యాల, (విజయక్రాంతి) : విద్యుత్ సేవలు జిల్లా వినియోగదారులకు మరింత చేరువగా అందించేందుకు టీ జీ ఎన్ పీ డీ సీ ఎల్ యాప్ (TG NPDCL APP) ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 ఫీచర్లతో వినియోగదారులకు అన్ని సౌకర్యాలు ఈ యాప్ లో పొందుపరిచారు. వేసవిలో వినియోగదారులు ఇంటి వద్ద నుంచే ఈ యాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. 

అందుబాటులో ఉన్న ముఖ్య ఫీచర్లు ఇవే...

1) కన్స్యూమర్ గ్రీవెన్సెస్ ( CONSUMER GRIEVANCES) : 

i) న్యూ కంప్లైంట్ (NEW COMPLAINT): వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా యాప్ లో నమోదు చేసుకోవచ్చు. మీటర్ నంబర్, సమస్య వివరాలు నమోదు చేస్తే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. విద్యుత్ కు సంబంధించిన అన్ని రకాల ఫిర్యాదులు చేసుకునే సౌకర్యం ఇందులో కల్పించబడింది.

ii) కంప్లైంట్ స్టేటస్ (COMPLAINT STATUS) : ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కార స్థితిని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

2) పే బిల్స్ (PAY BILL) : వినియోగదారులు తమ సర్వీస్ నంబర్ నమోదు చేసి నెలవారీ విద్యుత్ బిల్లులను సులభంగా, వేగవంతంగా, సురక్షితంగా చెల్లించవచ్చు. కేవలం రెండు నిమిషాల్లో చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. డిజిటల్ చెల్లింపుల ద్వారా సమయం ఆదా అవుతుంది.

3) బిల్ హిస్టరీ (BILL HISTORY) : గతంలో చెల్లించిన విద్యుత్ బిల్లుల వివరాలను ఇందులో చూడవచ్చు. ప్రతి నెల విద్యుత్ వినియోగం ఎంత పెరిగిందో తెలుసుకొని విద్యుత్ పొదుపు చర్యలు తీసుకోవచ్చు.

4) వినియోగదారుల బిల్లు సమాచారం (KNOW YOUR BILL) : సర్వీస్ నంబర్ నమోదు చేసి బిల్లు వివరాలు, చెల్లించాల్సిన మొత్తం తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

5) ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ (ONLINE PAYMENT HISTORY) : ఆన్ లైన్ ద్వారా చెల్లించిన బిల్లుల పూర్తి వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

6) రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ (REPORT AN INCIDENT) : ఎక్కడైనా విద్యుత్ సంబంధిత ప్రమాదం లేదా సమస్య గమనించినట్లయితే GPS లొకేషన్ తో పాటు ఫోటో తీసి యాప్ ద్వారా పంపవచ్చు. సమాచారం నేరుగా సంబంధిత అధికారికి చేరి వెంటనే చర్యలు తీసుకుంటారు.

7) కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి (HOW TO TAKE NEW CONNECTION) : కొత్త విద్యుత్ కనెక్షన్ కు అవసరమైన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం ఇందులో అందుబాటులో ఉంటుంది.

8) పేరు / లోడ్ మార్పు (NAME, LOAD, CATEGORY CHANGE) : విద్యుత్ మీటర్ పేరు మార్పు, లోడ్ పెంపు లేదా తగ్గింపు సంబంధిత వివరాలు, దరఖాస్తు విధానం ఇందులో పొందుపరచబడింది.

9) హెచ్టి కన్స్యూమర్ పోర్టల్ (HT CONSUMER PORTAL) : హెచ్ టీ వినియోగదారులు తమ మొబైల్ నంబర్ తో నమోదు చేసుకొని సర్వీసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

10) ఆన్ లైన్ ఎస్టిమేట్ / డిమాండ్ నోటీసు చార్జీల చెల్లింపు (ONLINE ESTIMATE / DEMAND NOTICE CHARGES PAYMENT) : కొత్త పనులకు సంబంధించిన ఎస్టిమేట్లు, డిమాండ్ నోటీసు చార్జీలను ఆన్ లైన్ లో చెల్లించే సౌకర్యం కల్పించింది.

11) చాలెంజింగ్ మీటర్ (CHALLENGING METER) : మీటర్ రీడింగ్ సక్రమంగా నమోదు కాలేదని భావించినట్లయితే వినియోగదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.

12) వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు (KNOW YOUR OFFICER) : సంబంధిత అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. సందేహాలు లేదా సమస్యల పరిష్కారం కోసం నేరుగా అధికారులను సంప్రదించవచ్చు.

13) లింక్ ఆధార్ & మొబైల్ (LINK AADHAR & MOBILE) : ఆధార్, మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడం ద్వారా ప్రతి నెల బిల్లు సమాచారం నేరుగా ఫోన్ కు అందుతుంది. వెంటనే యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

14) డొమెస్టిక్ బిల్ క్యాలిక్యులేటర్ (DOMESTIC BILL CALCULATOR) : వినియోగదారులు మీటర్ రీడింగ్ నమోదు చేస్తే అంచనా విద్యుత్ బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు.

15) పవర్ కన్జంప్షన్ గైడ్ లైన్స్ (POWER CONSUMPTION GUIDELINE) : వివిధ విద్యుత్ ఉపకరణాలు ఎంత విద్యుత్ వినియోగిస్తాయో ఇందులో వివరించబడింది.

16) సేఫ్టీ టిప్స్ (SAFETY TIPS) : విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో పొందుపరచబడ్డాయి. విద్యుత్ ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ గుర్తించి స్వయంగా రిపేర్లు చేయకూడదని సూచించారు.

17) ఫీడ్ బ్యాక్ (FEEDBACK) : సంస్థ అందిస్తున్న సేవలపై వినియోగదారులు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అందిన సూచనల ఆధారంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.

18) కాంటాక్ట్ అజ్ (CONTACT US) : 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ లు ఇందులో అందుబాటులో ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు 1912 నంబర్ లో సంప్రదించవచ్చు.

ఇంటి నుంచే అన్ని సేవలు - ఎస్ఈ బీ రాజన్న

విద్యుత్ వినియోగదారులు ఇంటి నుంచే అన్ని సేవలు పొందవచ్చునని మంచిర్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బీ రాజన్న (MANCHERIAL DISTRICT SUPERINTENDING ENGINEER B.RAJANNA) పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడించి టిజి ఎన్పీడీసీఎల్ యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం 28 ఫీచర్లతో ఈ యాప్ అందుబాటులో ఉందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.