అందుకే ఇంత అరాచకం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హిట్లర్ ఆదర్శమట
- ‘హైడ్రా’ హంతక ముఠాలాంటిది
- సీఎం ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశానికి అర్థమైంది
- మాకు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జయశంకర్ సార్ ఆదర్శం
- మా పాలన రాజ్యాంగ స్ఫూర్తితో సాగింది..
- హిట్లర్ వంటి నియంతృత్వ చర్యలతో కాదు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అత్యంత క్రూరు డైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ ఏర్పాటుచేసిన ‘హైడ్రా’ ఓ హం తక ముఠా లాంటిదని, సీఎం నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి వైఖరిని కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
మాకు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జయశంకర్ సార్ ఆదర్శమని, మా పదేండ్ల పాలన రాజ్యాంగ స్ఫూర్తితో సాగిందని, మీలాగా హిట్లర్ వంటి నియంతృత్వ చర్యలతో కాదని వివరించారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడల పై తెలంగాణ సమాజం తిరగబడే రోజు లు దగ్గర్లోనే ఉన్నాయని, ‘హిట్లర్ హటా వో.. తెలంగాణ బచావో’ పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. బెంగుళూ రు వేదికగా జరిగిన ‘ది హిందూ’ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆదివారం ఎక్స్‌వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటుచేసిన ‘హైడ్రా’ సంస్థకు, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పు డు దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. సీఎం వైఖరిని నిలదీస్తూ, కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు, నరరూప రాక్షసుడైన హిట్లర్ నీకు రోల్ మోడలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
మొత్తం మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేధం సృష్టించిన ‘హిట్లర్ నీకు ఆదర్శం’ అని చెప్ప డానికి సిగ్గనిపిస్తలేదా అని దుయ్యబట్టారు. ‘మొన్న ప్రజా పాలన అన్నవు. నిన్న ఇందిరమ్మ పాలన అన్న వు. నేడు నేరుగా హిట్లర్ పాలన అని ఒప్పుకున్నావు’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘రెండున్నరేళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు నిజంగానే హిట్ల ర్ ఆరాచకాన్నే తలపించాయి. ఇవి యుద్ధం మిగిల్చే విషాదాల్నే మించిపోయాయి’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా నుంచి మూసీ వరకు, లగచర్ల నుంచి వెలుగుమట్ల వరకు పేదలపై విరుచుకుపడిన ‘నీ బుల్డోజర్లు నయా నాజీ పాలనకు నిజమైన సా క్ష్యాలు’ అని కేటీఆర్ అభివర్ణించారు. పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను సంక్షోభాల పాతాళంలోకి నేట్టిన నాడే ‘నీ నియంత పోకడలు బయటపడ్డాయి’ అని మండిపడ్డారు.
‘విధ్వంసమే నీ విధానమని, వి కాసం అంటే నీకు తెలియదని, ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండటం రా జ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను నిలువెత్తు కీర్తించే నీ దుర్మార్గమైన మనస్తత్వం స్వతం త్ర భారతావనిలోనే ఓ చీకటి అధ్యా యమన్నారు.
హైడ్రా.. ఓ హంతక ముఠా..
ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయని, రాష్ట్ర గ్రామగ్రామాన లేచిన ఉక్కుపిడికిళ్లు వారిని పొలిమేరల దాకా తరిమికొట్టాయని కేటీఆర్ గుర్తుచేశారు. తలకెక్కిన అధికారంతో విర్రవీగిన హిట్లర్‌కు ఆనాడు ఏ గతి పట్టిందో, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో రేవంత్‌రెడ్డి పాలనకు అదే గతి పట్ట డం ఖాయమని స్పష్టం చేశారు. ‘మీకు స్ఫూర్తి హిట ర్.. ముమ్మాటికీ నిజమే’నని, రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ ఒక అస్సాసినేషన్ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిదన్నారు.
నియంతలను పూజిస్తూ, పే దల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ ము రిసిపోతున్న రేవంత్‌రెడ్డి ఫాసిస్ట్ ఆలోచ నలను స్వ యంగా దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హింసాత్మక, కూల్చివేతల ధోరణిని తప్పుబడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్కు హిట్లర్ తరహా తెలివితేటలు తమకు లేవని, ఆయన లాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత తెలివైనవాళ్లం తాము కాదన్నారు.
అందుకే, తమ పదేళ్ల పరిపాలనను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ చూపిన అహింసా మా ర్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతి పదికన నడి పించామని గర్వంగా ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక సీఎం స్థానంలో ఉండి, ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రకటించడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడమే ధ్యే యంగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడలపై తెలంగాణ సమాజం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే మరో విముక్తి పోరాటం సాగడం తథ్యమని ‘హిట్లర్ హటావో.. తెలంగాణ బచావో’ పోరాటం తప్పదని స్పష్టం చేశారు.






