పంచ్ అదిరింది
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్ల పంచ్ అదిరిపోయింది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న మన బాక్సర్లు పతకాల వేటలో దూసుకెళుతున్నారు. ఆరోరోజు ఐదుగురు బాక్సర్లు సెమీస్‌లో అడుగుపెట్టారు. దీంతో ఇప్పటి వరకూ బాక్సింగ్‌లో 8 మెడల్స్ ఖాయమయ్యాయి. అటు అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ రజతాలు సాధించారు.
- భారత బాక్సర్ల జోరు
- ఒక్కరోజే 6 పతకాలు ఖాయం
- సెమీస్‌లో సాక్షి, అరుంధతి, జాస్మిన్, సచిన్, అంకుశ్, నరేందర్
- వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్‌కు రజతం
- నేడు క్వాలిఫికేషన్ బరిలో నీరజ్ చోప్రా
గ్లాస్గో, జూలై 29 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేటలో పుంజుకుంటోంది. చాలా క్రీడలు తొలగించడంతో ఈ సారి త క్కువ మెడల్స్ కే పరిమితమవుతుందని అం చనా వేసారు. అయితే అంచనాలు పెట్టుకున్న పలు క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చా టుతున్నారు. తాజాగా ఆరోరోజు పోటీల్లో భారత బాక్సర్ల ప్రదర్శన హైలెట్ గా నిలిచింది. మహిళల, పురుషుల విభాగాల్లో పో టాపోటీగా మెడల్స్ ఖాయం చేశారు. బుధవారం ఒక్కరోజే ఆరుగురు బాక్సర్లు సెమీఫై నల్లో అడుగుపెట్టారు.
దీంతో భారత్‌కు బాక్సింగ్‌లో ఇప్పటి వరకూ 8 మెడల్స్ ఖరారయ్యాయి. మొదట మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, మహిళల 70 కేజీల విభాగంలో అ రుంధతి చౌదరీ క్వార్టర్ ఫైనల్స్ లో అద్భుత విజయాలను అందుకున్నారు. క్వార్టర్ ఫైన ల్లో సాక్షి చౌదరి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్‌పై 5 తేడాతో గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో అరుంధతి చౌదరి న్యూజిలాండ్ బాక్సర్ మోర్గాన్ హెండర్స్‌పై 3 విజయం సాధించింది. ఇదిలా ఉంటే పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాజ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.
అతనితో పాటు పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్ ఫంగల్, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ కూడా సెమీస్ చేరుకున్నారు. బాక్సింగ్ లో సెమీస్ చేరితే కనీసం కాంస్య పతకం లభిస్తుంది. ఇప్పటి వరకూ భారత్ 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పతకాల పట్టికలో ఆధిపత్యం కనబరుస్తోంది. ఆస్ట్రేలియా 35 స్వర్ణాలు, 18 రజతాలు, 28 కాంస్యాలతో 81 పతకాలు గెలిచింది. కెనడా( 36 పతకాలు, ఇంగ్లాండ్ 44 పతకాలు, స్కాట్లాండ్ 16 , నైజీరియా 12 పతకాలతో టాప్ 5లో కొనసాగుతున్నాయి.






