30 July, 2026 | 2:22 AM

ప్రజలు మా వైపే చూస్తున్నారు..

30-07-2026 01:43 AM

టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ దామోదర్ గౌడ్ 

అడ్డాకుల జూలై 29 : ప్రజలు టిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని భవిష్యత్తులో దేవరకద్ర నియోజకవర్గంలో తమ సత్తా చాటుతామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దామోదర్ గౌడ్ అన్నారు. బుధవారం మండలం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి దేవరకద్ర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితక్క ప్రకటించిందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, అమలు చేయని హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. టిఆర్‌ఎస్ అందరికీ మేలు చేస్తుందని భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరాటే శ్రీనివాస్ సాగర్,నిజాం, కొత్త శీను, రాము, వెంకటరాముడు, తిరుపతయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.