పెద్దమ్మ విగ్రహాల ధ్వంసం చేసిన నిందితుడు అరెస్టు
16-10-2024 01:28 PM
గజ్వేల్ (విజయక్రాంతి): మద్యం మత్తులో సింగాయపల్లి గ్రామ శివారులో గల పెద్దమ్మ తల్లి దేవత మూర్తుల విగ్రహాలను పగులగొట్టిన నిందితున్ని గౌరారం పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కొప్పోజి వెంకటస్వామి చారి మంగళవారం రాత్రి మద్యం సేవించి గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను పగలగొట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితున్ని గుర్తించి బుధవారం ఉదయం అదుపులోకి తీసుకోని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




