15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం

19-05-2025 12:30 AM

- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

 సిరిసిల్ల,మే18, (విజయక్రాంతి ); అగ్రహారం వేములవాడ, ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతు లు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపా రు.

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం లోని శ్రీ హనుమాన్ దేవాలయం ఆవరణలో  31 లక్షలతో ప్రాకార గోడ(సాలహర ము), ఆర్చి నిర్మాణ కార్యక్రమాన్ని ఆదివారం  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ  రాజరాజేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, శ్రీ జోడఆంజనేయ స్వామి  అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు..రూ.150 పై చి లుకు కోట్లతో వేములవాడ ఆలయ పట్టణ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

ఇప్పటికే 47 కోట్ల కలెక్టర్ ఖాతాలో జమ అయి ఉన్నాయని తెలిపా రు.స్వామి వారి సన్నిధిలో అన్నదాన స త్రం, 76 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, నాయకులు కేకే మహేందర్ రెడ్డి,వేములవాడ  మార్కేట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, ఈవో శ్రీనివాస్. ఆలయ చైర్మన్. మహేందర్ కాం గ్రెస్ పార్టీ అర్బన్  మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య. మాజీ ఎంపీటీసీ గాలిపెళ్లి స్వామి. అధికారులు తదితరులు పాల్గొన్నారు.