19-05-2025 12:29:51 AM
రాజేంద్రనర్, మే 18: సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైందవనగర్ లో ఈనెల మే 23 శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించబోయే శ్రీ ప్రణవభక్త సమాజం ఏకశతపంచొత్తర మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే యాగశాల కోసం ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ప్రణవభక్త సమాజం అధ్యక్షులు మోండ్ర నరసింహ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రణవభక్త సమాజం ఉపాధ్యక్షులు బర్ల మల్లారెడ్డి, ముఖ్య సలహాదారులు నారగుడెం మల్లారెడ్డి, సాబాద విజయ్ కుమార్, సభ్యులు సుల్గె మహేందర్, విద్యాసాగర్, సాయి యాదవ్, కిషన్ సాయి తదితరులు పాల్గన్నారు