19-05-2025 12:31:07 AM
కరీంనగర్, మే 18 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ ఆదివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మొదటగా గోదాం గడ్డలోని ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సన్ షైన్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
తదనంతరం సాయినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్య పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం.. కొత్తపల్లి మండలంలోని బదిపల్లి గ్రామంలో శ్రీ అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ్ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల హాజరై కళ్యాణోత్సవం లో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంగుల తో పాటు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, దుర్షెడ్ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు మిడిదొడ్డి నవీన్ లు పాల్గొన్నారు.
అలాగే కళ్యాణ వేడుకల్లో సూడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నగర బిఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి,మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయకమిటి బాద్యులు, తదితరులు పాల్గొన్నారు.