2 July, 2026 | 12:10 AM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

యాపిల్ క్రేజ్ తగ్గేదేలే

21-09-2024 02:40 AM

ఐఫోన్ 16 కోసం ఎగబడిన జనాలు

స్టోర్ల ముందు బారులు తీరిన కొనుగోలుదారులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: స్మార్ట్ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన యాపిల్ నుంచి కొత్త సిరీస్ వస్తోందంటే చాలు హడావుడి మామూలుగా ఉండదు. స్టార్ హీరోల మూవీలకు ఫస్ట్ డే టికెట్ల కోసం క్యూ కట్టినట్టు తొలి ఫోన్‌ను దక్కించుకునేందుకు వినియోగదారులు ఎగబడుతారు. ఎన్నేళ్లు గడిచినా యాపి ల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం యాపిల్ తన ఐఫోన్ సిరీస్ ఫోన్ల విక్రయాన్ని భారత్‌లో ప్రారంభించింది. స్టోర్లు ఓపెన్ చేయటమే ఆలస్యం అన్నట్లు యాపిల్ లవర్లు దుకాణాల ముందు క్యూ కట్టారు.

ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఫోన్‌ను శక్తిమంతంగా రూపొందించి నట్లు సంస్థ ప్రకటించడంతో మరింత క్రేజ్ కనిపిస్తోంది. దీంతో తొలిరోజే స్టోర్ల ముందు జనాలు పెద్దఎత్తున బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఐఫో న్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్,యాక్షన్ బటన్ ఫీచర్లను జత చేశారు.