1 July, 2026 | 11:04 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

లోయలో పడిన బీఎస్‌ఎఫ్ బస్సు

21-09-2024 02:39 AM

నలుగురు జవాన్లు మృతి, 30 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 20: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుంది. విధుల్లో భాగంగా 7 బస్సుల కాన్వాయ్ బయలుదేరగా బ్రెల్ గ్రామం వద్ద అందులోని ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. స్థానికులు, బలగాలు సహాయ చర్యలు చేపట్టాయి.