తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బీఆర్‌ఎస్‌తో సాధ్యమైంది
బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నిర్మల్ జూన్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష బిఆర్‌ఎస్ తోని సాధ్యమైందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాద వ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అ నంతరం తెలంగాణ ఉద్యమకారులను స న్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అని ల్ జాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ తన పదవులను గడ్డి పోచల్లేక్క రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించారని, రాష్ట్ర ప్ర యోజనాల కోసం ఒక్కడిగా మొదలై లక్షలాది మందిని జోడించి ఉద్యమాన్ని మధ్య లో ఆపితే రాళ్లతో కొట్టి చంపండి అని ద మ్మున్న మాట చెప్పిన ఘనత కేసీఆర్ గారిదని అన్నారు.
అనేక మంది విద్యార్థుల ప్రా ణలను బలి తీసుకున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని కండిస్తూ కేసీఆర్ ఆమర ణ నిరాహారదీక్ష మొదలు పెట్టారని పేర్కొన్నారు. ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగలతో జూన్ 2 2014 నాడు తెలంగాణ రాష్ట్రం సాధించబడిందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి రాంకిషన్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మన్ లోలం శ్యామసుందర్, కౌన్సిలర్ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






