బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి
శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్.
శంకర్ పల్లి, మే 26(విజయ క్రాంతి): బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ పేర్కొన్నారు. మంగళవారం శంకర్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
అదేవిధంగా స్లాటర్ హుస్సేన్ నుండి వచ్చిన వ్యర్ధాలను సేకరించడానికి రెండు ప్రత్యేక ఆటోలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యర్ధాల తరలింపులో ఎటువంటి ఇబ్బందులు కలిగిన ఏరియా జవాన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి సిఐ మీర ముద్దసరలి, ఎస్త్స్ర సురేష్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.






