వాగ్దేవి జయకేతనం
- ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు
విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): తమకు మరెవరు సాటిలేరని చాటి చెబుతూ కళాశాల ఆవిర్భవించిన అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటూ, అద్భుతాలను సృష్టించింది. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థు లు విజయకేతనం ఎగురవేశారు. మొదటి సంవత్సరం ఎంపీసీ భాగంలో భరత్ కృష్ణ 468 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సొంతం చేసుకోగా, సంజన 467 మార్కులను సాధించింది.
మొదటి సంవత్స రం బైపీసీ విభాగంలో సిద్ర ఫాతిమా 438 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించారు కాన్స తబస్సుమ్ 437 మా ర్కులతో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు, సెకండ్ ఇయర్ ఎంపీసీ ఆస్పియా తబస్సుమ్ 994 మార్కులు, వైశాలి 993, అమీనా మరియ మ్ 991, కౌశిక్ 991, ఉమామ్ అనమ్ 991, బైపీసీ విభాగంలో అనువర్సిత 993 మార్కులతో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ వి జేత వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఫ లితాలను సాధించడానికి అధ్యాపకుల కృషి, నాణ్యమైన బోధనే కారణమన్నారు. ఈ సం దర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూ డా ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, అకాడమీ ఇంచార్జ్ పావనిరెడ్డి, రాఘవేంద్ర రావు, నాగేందర్, సతీష్‌రెడ్డి, రఘువరన్‌రెడ్డి, నరేష్, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతినందన్‌రెడ్డి, ఎంసెట్ ఇం చార్జ్ షాకీర్, ఎగ్జామినేషన్ ఇంచార్జ్ చెన్న య్య, యాకూబ్ రత్నాకర్, హుస్సేన్ అధ్యాపకులు పాల్గొన్నారు.




