04-02-2026 02:11:08 AM
మాదాపూర్ భ్రమరాంబ మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్క పల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. మల్లన్న స్వగ్రామమైన మాదాపూర్‌లో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు హాజరైన ఆయన,
ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆల య ప్రాంగణంలో భక్తులు, గ్రామ ప్రజలతో కొంతసేపు ముచ్చటించి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడు తూ.. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామ అభివృద్ధి మరింత వేగం గా జరగాలని ఆకాంక్షించారు. ప్రజలతో నేరుగా మమేకమై మాట్లాడటం తనకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.