calender_icon.png 9 January, 2026 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్ వాళ్లు విహారయాత్ర చేస్తుండ్రు

08-01-2026 01:35:58 AM

  1. కర్వేన దగ్గర కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామన్నారు ఎందుకు చేయలేదు..

నార్లపూర్‌లో మోటారు ఆన్ చేసి ఇంటికి వెళ్లె వరకు బంద్ అయింది 

ఇలా వచ్చి అలా వెళ్లారు.. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి 

వనపర్తి, జనవరి 7 (విజయక్రాంతి) : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా కర్వేన రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం భూత్పూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పటి సి ఎం కే సి ఆర్ అప్పటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేయి ఇక్కడే ఉండి పూర్తి చేసి పోతానని చెప్పి మీ ప్రభుత్వం అధికారం పోయే వరకు ఎందుకు పూర్తి చేయలేక పోయారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. 

బుధవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా 2023 లో నార్లపూర్ దగ్గర ఒక మోటారు ఆన్ చేసి అక్కడి నుండి చెంబులతో నీళ్లను తెచ్చి ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి గుడి దగ్గర జలాభిషేకం కార్యక్రమం ను అప్పటి బి ఆర్ ఎస్ నాయకులు చేసారని నార్లపూర్ లో మోటారు ఆన్ చేసినంక హెలికాప్టర్ లో కే సి ఆర్ ఇంటికి వెళ్లే వరకు మోటార్ బంద్ అయ్యిందన్నారు.

అధికారం పోయిన తరువాత రెండు సంవత్సరాల తరువాత నిద్ర లేచిన కే సి ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అసెంబ్లీ కి వచ్చి మూడు నిముషాలు ఉండి వెళ్లిపోయాడన్నారు.

ఏనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేయకుండా ఎందుకు పెండింగ్ లో పెట్టారని అధికారం లో ఉన్నప్పుడు అడుగలేక పదవి పోయిన తరువాత ప్రజలు తమను మరిచిపోతారని ఉమ్మడి జిల్లా మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లకు పని పాట లేక ప్రాజెక్టు ల పేరుతో విహారయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. రూ 27 వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు లో తల తోక లేకుండా పనులు చేసారని ఒక ప్రాజెక్టు లో పని పూర్తి కాకముందే ఇంకో ప్రాజెక్టు కు టెండర్లు పిలిచారన్నారు.

రూ 27 వేల కోట్లలో రూ 15 వేల కోట్లు పంపుల కోసం కమిషన్లు వస్తాయని ఖర్చు పెట్టారని మొత్తం 57 వేల కోట్లకు డిపి ఆర్ అనుమతి కోసం పెట్టినప్పుడు రూ 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పనులు పూర్తి అయ్యాయని బి ఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు కదా ఎట్లా పూర్తి అయ్యినట్లు ఆ నాయకులే ప్రజలకు వివరించాలన్నారు.

ఉమ్మడి పాలమూరు లో ప్రాజెక్టు లను పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రాజెక్టు ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది గడిచిన 10 ఏండ్ల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు ల కోసం ఎంత ఖర్చు చేసింది అన్న విషయం పై చర్చ కు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాలు విసిరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సి ఎం రేవంత్ రెడ్డి అని 14 నియోజకవర్గం లలో ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చేసే బాధ్యత సి ఎం పై ఉందని అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు కు 1లక్ష కోట్లు కేటాయిస్తానని సి ఎం హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. 

ఇలా వచ్చి అలా వెళ్లారు..

రెండు సంవత్సరాలు నిద్ర పోయి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి నిద్ర లేచి నీళ్ల దోపిడీ అని మాటలు మాట్లాడి అసెంబ్లీ కి వచ్చి తోలు తీస్తా అని కే సి ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పి తీరా అసెంబ్లీ కి ఇలా వచ్చి అలా వెళ్లారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లు విహారయాత్ర చేసి ఎక్కడో ఒక దగ్గర సమావేశం పెట్టి ఎప్పుడు మాట్లాడని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు.

కృష్ణ నీటి, పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు మీద విశ్లేషణ చేసిండు కాళేశ్వరం మాదిరిగా ఎంక్వయిరీ చేస్తాం అనే వరకు పారిపోయిండు  ముందు మామా పారిపోయిండు తరువాత వాళ్లు పారిపోయరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అభివృద్ధి పథంలో దూసుకుని పోతున్న విషయంను చూసి ఓర్వలేక అక్కడ ముఖం లేక పారిపోయి బయటకు వచ్చి ఎం చెబుతున్నారుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని చెబుతున్నారన్నారు.

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నా రని తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మైక్ ఇవ్వలేదు కానీ మీ ప్రభు త్వం లో మాత్రం మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని చెబుతున్నారని ఆయన వివరించారు. గతం లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాలకు ఏనాడూ మాట్లాడానికి అవకాశం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో మీరు రండి మీ విలువైన సూచనలు ఇవ్వండి అని సి ఎం చెబుతున్నారన్నారు.  రాయల సీమను రత్నాల సీమ చేస్తా అని జగన్ ను కలిసి రోజమ్మ ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నది కే సి ఆర్ కాదా అని అయన ప్రశ్నించారు