08-01-2026 01:34:49 AM
చేర్యాల, జనవరి 7: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2.0 పధకం ద్వారా పెద్ద చెరువు పునర్జీవనం కొరకు రూ. 314.60 లక్షలు మంజూరైనట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ పధకంలో భాగంగా చెరువు కట్ట విస్తరీకరణ, చెరువు చుట్టూ ఇనప రేలింగ్, చైన్ మేష్ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ పాత్ వే, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయడం పట్ల పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.