calender_icon.png 9 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో అవినీతి అధికారులు

08-01-2026 01:35:59 AM

రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నందిగామ ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి 

షాద్‌నగర్, జనవరి 7 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్‌సింగ్, ఈదులపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య బుధవారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు పట్టుకున్నారు. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామ వ్యవసాయ క్షత్రంలో భవన నిర్మాణ అను మతి కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీఓ తేజ్ సింగ్, ఎంపీ డీవో సుమతి రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు రెండున్నర లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే లక్ష యాభై వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. మిగతా లక్ష రూపాయలు బుధవారం నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.