1 March, 2026 | 2:33 AM

కిక్కెక్కించే మెన్షన్ హౌస్ మల్లేష్

01-03-2026 12:35 AM

థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులతో కిక్కెక్కించేందుకు సిద్ధమయ్యాడు ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్లు. మార్చి 6న రిలీజ్ కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లిచూపులు, పెళ్లి తర్వాతి సంఘటనలతో ఈ సినిమాను వినోదాత్మకంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో డాక్టర్ బ్రాండ్ పేరు అడిగితే ‘జై బాలయ్య’ అని చెప్పడం మాస్‌కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది. హీరో శ్రీనాథ్.. మల్లేశ్ పాత్రలో ఒదిగిపోయారు. గాయత్రి రమణ పాత్ర ఎమోషన్‌ను యాడ్ చేసింది. మురళీధర్‌గౌడ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి పాత్రలు మంచి వినోదాన్ని పంచాయి. మొత్తంగా డైరెక్టర్ బాల సతీశ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; డీవోపీ: అమ్మముత్తు; ఎడిటర్: గ్యారీ బీహెచ్.