calender_icon.png 15 December, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారానికి తెర..!

13-12-2025 12:22:34 AM

రెండవ విడత ఎన్నికలు రేపు..

కరీంనగర్, డిసెంబరు 12(విజయక్రాం తి): కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్ లో కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కొంతం రాజం ల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన నిర్వహించారు.

ఈ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాం గ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కొమిరెడ్డి విజయ్ ఆ జాద్ హాజరై ఈ సందర్భంగా నూతనంగా గె లుపొందిన సర్పంచులను ఉపసర్పంచుల ను వార్డు మెంబర్లను కాంగ్రెస్ పార్టీ కండు వా కప్పి శాలువాలతో సన్మానించారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో 78 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్య ర్థులు 44 స్థానాల్లో గెలుచుకోవడం జరిగిందన్నారు.

కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి అయిలాపూర్ కల్లూరు ధర్మారం వెంకటాపూర్ చిన్న మెట్పల్లి మోహన్ రావు పేట వంటి కీలక గ్రామాలతో పాటు మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల బండలింగాపూర్ రామలచ్చక్క పేట జగ్గాసాగర్ మల్లాపూర్ మండలంలోని పాత దామరాజ్ పల్లి గో ధూర్ శ్రీరాంపూర్ వాల్గొండ తండా నడి కొత్త ధామ్రాజు పల్లి ఇబ్రహీంపట్నం మండ లం పకీర్ కొండాపూర్ వేముల కుర్తి వంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందని ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు నిదర్శనం అన్నా రు.

వేంపేట గ్రామంలో గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఎల్లమ్మ గుడి వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారానే అక్కడ ప్రత్యర్థి అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం అభినందనీయం అన్నారు గో ధూర్ గ్రామ సర్పంచ్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా 1800 ఓట్ల మెజార్టీతో సమీప బిఆర్‌ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగిందని నూతనంగా గెలిచిన గ్రామ సర్పంచ్ గ్రా మ అభివృద్ధి ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం అనునిత్యం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడ మే ధ్యేయంగా పని చేయడం ద్వారానే భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగిందన్నారు .

వేంపేట గ్రామంలో సమీప బీఆర్‌ఎస్ అభ్య ర్థి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం ప్రతిపక్షాలు ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనునిత్యం గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయడమే కాకుండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కుల సంఘ భవనాలకు నిధులు మం జూరు చేయించడం ద్వారానే అక్కడ ఆయన గెలుపొందడం జరిగిందన్నారు .

కోరుట్ల మం డలం తిమ్మయ్యపల్లి గ్రామంలో తల్లి కూ తుర్ల మధ్య బిఆర్‌ఎస్ పార్టీ చిచ్చుపెట్టి తల్లిని బలవంతంగా పోటీ చేయించడం జరిగిందన్నారు అయినా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడం జరిగిందన్నారు కోరుట్ల మండలం అయిలా పూర్ గ్రామంలో జనరల్ స్థానం అయినప్పటికీ అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టి 570 కోట్ల మెజార్టీతో బీసీ అభ్యర్థి రామకృష్ణ గెలుపొందడం జరిగిందన్నారు కాంగ్రెస్ పా ర్టీ చేస్తున్న అభివృద్ధి సంఘ భవనాలకు ని ధుల మంజూరు చేయడమే ఇట్టి గెలుపుకు నిదర్శనం అన్నారు.

అహంకారం అధికారం పనికిరాదని అహంకారం అధికారంతో రా జ్యాలు అధికారాలు కోల్పోతారన్నారు ము త్యంపేట గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం గ్రామానికి సంఘ భవనాల నిధులు మంజూరుకు కారణమన్నారు ఫకీర్ కొండాపూర్ గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికా రం చేపట్టడం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామంలోని సంఘ భవనాలకు చేస్తు న్న .

అభివృద్ధి సంక్షేమ పథకాల నిదర్శనం అన్నారు రాబోయే స్థానిక సంస్థలు జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జరిపిన ప్రతి ఒక్క రు కృషి చేయాలని సూచించారు అనంత రం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ వెల్లుల నూతన గ్రామ సర్పంచ్ గా గెలుపొంది న వ్యక్తి అనునిత్యం గ్రామ అభివృద్ధి సం క్షేమం కోసం తపనపడే వ్యక్తి కాబట్టి ప్రతిపక్షాలు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు పొడి చేసిన ఆయన గెలుపు ఎవరు ఆపలేకపోయారని అభివృద్ధి సంక్షేమము ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని కావున ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కృషి చేయాలని సూచించారు.

వేంపేట గ్రా మంలో కూడా ప్రతిపక్షాలు ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టిన అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే గెలుపొందడం ఆయన గ్రామానికి చేస్తున్న సేవ ఎందుకు కారణమన్నారు నూ తన గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ప్రతి ఒక్కరూ కూడా అవినీతి రహిత పాలన అం దించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని కావున ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ లు డైరెక్టర్లు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు