13-12-2025 12:25:16 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణలో రెండో విడ త పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసిం ది. ఈ నెల 11వ తేదీన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రాష్ట్రవ్యాప్తంగా కోలాహ లంగా మారిన వాతావరణం. రెండో విడత ప్రచారాన్ని తెర పడటంతో తాజాగా గ్రామీణ తెలంగాణ మరోసారి నిశ్శబ్దంగా మారింది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ నెల 14న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 57,22,665 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 27,96,006 మంది పురుషులు, 29,26,506 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. , 193 మండలాలలో అధికారులు 38 వేల 337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తొలి విడతలో కాంగ్రెస్ హవా
తొలి దశలో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 3,836 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 2,383 బీఆర్‌ఎస్ 1,146, బీజేపీ 181, ఇతరులు- 455 సీట్లను కైవసం చేసుకున్నారు. మొత్తం పోలింగ్ 84.28 శాతం నమోదు కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైంది.