calender_icon.png 6 February, 2026 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొద్దు నిద్రలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే

06-02-2026 12:06:55 AM

రెవెన్యూ అధికారులు.. కార్పొరేటర్ కొంతం 

సికింద్రాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కంటోన్మెంట్ నియోజకవర్గ మొండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లి లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్‌లు పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక కార్పొరేటర్ కొంత దీపిక ఆరోపించారు.నిర్మాణం చేపట్టి ఏళ్ల కాలం గడిచిన రెండో దశ పంపిణీ ఎం దుకు చేయలేదు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనేక అక్రమ లావాదేవీలు జరిగి చేతులు మారినట్లు ఆమె ఆరోపించారు.

అందులో భాగంగానే రెండోదశ ఇం డ్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యం అవుతోందని ఆమె వెల్లడించారు. ఈనెల 10వ తేదీ లోపు ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కార్పొరేటర్ కొంతం దీపిక డిమాండ్ చేస్తూ మారేడు పల్లి డబల్ బెడ్ రూమ్ ప్రాంగణంలో నిరాహార దీక్ష చేపట్టారు. స్థలాలు కోల్పోయి, భవనాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని కార్పొరేటర్ ఆరోపించారు. ఇప్పటికైనా డబల్ బెడ్ రూమ్ లో పంపిణీ కార్య క్రమంలో పారదర్శకత పాటించాలని లేదం టే మరో ఉద్యమం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు,బిజెపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.