calender_icon.png 6 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

06-02-2026 12:07:20 AM

గుండాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పలు సమస్యలపై వినతీ పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక తొలకాల్లో ఫారెస్ట్ , రెవిన్యూ అధికారుల జాప్యం, మండల కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణం, బస్టాండ్ నిర్మాణం, పీహెచ్సీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఏఎన్‌ఎం ల పోస్టుల భర్తీ, డ్రైనేజీ, మెయిన్ రోడ్డులో ఉండే ట్రాఫిక్, మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు, ప్రైవేట్ వ్యక్తుల భూ ఆక్రమణల గురించి సమస్యలను వివరించగా  మరుగుదొడ్లు వెంటనే అమలు చేస్తామని దానికి సంబందించిన స్థలం గ్రామస్తులు కేటాయించడమే ఆలస్యం అని కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

మిగిలిన సమస్యల గురుంచి విచారించి త్వరలోనే వాటికి పరిష్కారం చూపిస్తా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ, ఎస్కే అబ్దుల్ నభి, ఏడవ వార్డ్ మెంబర్ జాటోత్ వీరన్న, వాంకుడోత్ రమేష్, ఎస్కే కాసీం, ఎస్కే ఇస్రార్, గడ్డం రాజేష్, నూనావత్ నరసింహ, బానోత్ నరేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.