12 July, 2026 | 11:47 AM

ఔటర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన కారు

01-10-2024 01:20 AM

ఒకరి దుర్మరణం

రాజేంద్రనగర్, సెప్టెంబర్30: ఔట ర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ వక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. హిమాయత్ సాగర్ వద్ద రింగ్‌రోడ్డుపై సోమవారం ఉదయం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టగా కారు నడుపుతున్న వ్యక్తి రింగు రోడ్డుపై నుంచి కిందపడి మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని ఎల్‌వీ ప్రసాద్ ఆసపత్రిలో పనిచేసే నిలయరెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.