09-01-2026 12:00:00 AM
తప్పిన పెను ప్రమాదం
నారాయణఖేడ్, జనవరి 8: నిజాంపేట్ నుండి బీదర్ 161 ఏ జాతీయ రహదారి పై కారు ముందు టైరు పేలిపోవడంతో రోడ్డు బ్రిడ్జి పక్కకు గల గోతిలోకి దూసుకెళ్లిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. నారాయణఖే డ్ పరిధిలోని మనూర్ మండల కేంద్రం వద్ద హైదరాబాద్ నుండి బీదర్ వైపుకు వెళుతున్న కారు మనూరు వద్దకు రాగానే ఒకసారిగా ముందటి టైరు పేలిపోవడంతో కారు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గోతిలోకి లోకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు గమనించి కారులో ఉన్న వ్యక్తులను బయటికి తీశారు.
108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. సహాయ కార్యక్రమంలో మనూరు మాజీ సర్పంచ్ శివాజీ రావు పాటిల్, 108 సిబ్బంది ఈఎంటి సుఖేందర్, పైలెట్ గోపాల్ పాల్గొన్నారు.