09-01-2026 12:00:00 AM
నారాయణఖేడ్, జనవరి 8: రోడ్డు భద్రతా నియమాలు పాటించి హెల్మెట్ ధరించిన వాహనదారులను నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్త్స్ర శ్రీశైలంలు సన్మానించారు. రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా గురువారం జాతీయ రహదారిపై పోలీసులు వాహనదారులకు అవగాహన నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. నిబంధనలు అధిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.