23 August, 2026 | 6:57 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠలో ఎమ్మెల్యే విజయరమణ రావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •  

పంతం నెగ్గించుకున్న ‘బండ్ల’

01-09-2024 02:08 AM
  1. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే అనుచరుడు 
  2. జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరితకు తప్పని భంగపాటు 
  3. గద్వాల్‌లో మరింత వేడెక్కుతున్న రాజకీయం 

గద్వాల(వనపర్తి), ఆగస్టు 31 (విజయక్రాంతి): గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరితకు ఘోర పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంతాన్ని నెగ్గించుకుని తన అనుచరుడు కుర్వ హనుమంతును మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమిచంపకున్నారు. 16 మంది సభ్యులను కూడా ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. దీంతో గద్వాలలో రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి నుంచి వచ్చిన వారికి అవకాశం క ల్పించడం ప ట్ల సరిత అనుచర వర్గాల్లో తీవ్ర నైరాశం నెలకొంది. గత కొన్ని రోజుల క్రితం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును సరిత వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మంత్రి తెరవెనుక చక్రం తిప్పారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.