25 April, 2026 | 2:06 AM

బీసీలకు కేంద్రం అన్యాయం

25-04-2026 12:00 AM
  1. సమస్యల పరిష్కారానికి ఒత్తిడి పెంచండి
  2. సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలి
  3. ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభకు హాజరుకండి
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
  5. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో బీసీ సంఘాల భేటీ

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించడం కోసం కర్ణాటక ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఆగస్టు 7న బెంగ ళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యను బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం బెంగుళూరులోని కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యని ఆయన నివాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రలకు చెందిన బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు.ఈ సందర్భంగా పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకి వారు అందజేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్‌రావు, మహారాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ భవన్ రావు తైవాడి, సచిన్ రాజోల్కర్, కర్ణాటక రాష్ట్ర బీసీ నాయకులు కుర్ర లక్ష్మణ్ యాదవ్‌లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లా డారు.

దేశ జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, మహిళా బిల్లులు బీసీ మహిళకు సబ్ కోట కల్పించకుండా, జన గణనలో బీసీ కుటుంబాల లెక్కింపు చేపట్టకుండా, అగ్రవర్ణాలకు లేని 50 శాతం పరిమితిని కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించి తీవ్ర అన్యాయం చేస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

జాతీయ స్థాయిలో బీసీ డిమాం డ్ల పరిష్కారం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభు త్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, బీసీ మహిళలకు సబ్ కోట, రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత, బీసీ కుటుంబాల లెక్కింపుపై కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర కులగనన చేపట్టడం అభినందనీయమని,కులగణన త్వరగా పూర్తిచేసి, జనాభా ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆయన కోరారు.

బీసీ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి అండ గా నిలబడాలని ఆయన కోరారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ మహారాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ బబన్ రావ్ తైవాడేమాట్లాడుతూ మండల్ సిఫార్సులు అమలులోకి వచ్చిన రోజైనా ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం 11వ జాతీయ ఓబీసీ మహాసభ బెంగళూరులో నిర్వహిస్తున్నామని, ఈ మహా సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసిన వారిలో జాతీయ బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కుమార్, అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, జనగాం రవీందర్ గౌడ్ తదితరులున్నారు.