25 April, 2026 | 2:13 AM

ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం

25-04-2026 12:01 AM

కాపర్ వైర్ చోరీ

భీమిని, ఏప్రిల్ 24 : మండలంలోని వడాల గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాప ర్ వైర్‌ను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం అర్ధరాత్రి వెలుగు చూసింది. మండలంలోని వడాల గ్రామానికి చెందిన చిన్నయ్య అనే రైతు పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ వైర్ ను గుర్తు తెలియని దొంగలు ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి కాపర్ తీగలను ఎత్తుకెళ్లారు.

ఉదయం రైతు పంటకు నీరు అందించేందుకు వెళ్లగా ధ్వంసం చేసి ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ని చూసి కాపర్ వైర్ దొంగతనానికి గురైనట్టు గమనించి అధికారులకు సమాచారం అందించారు. వరి పంట పూత, కాత సమ యంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి తీగలు దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యా డు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవా లని రైతులు కోరుతున్నారు.