16 March, 2026 | 1:45 AM

కుర్చీ భార్యది.. అధికారం భర్తది!

16-03-2026 12:00 AM
  1. మహిళా సర్పంచ్‌లు పేరుకే..
  2. సంతకం, ఫోటోలకే మహిళా ప్రజాప్రతినిధులు
  3. సర్పంచ్ భర్తలే నిర్ణయాలు..  అధికారులు మౌనం?
  4. మహిళా వార్డు సభ్యుల పరిస్థితి కూడా అంతే..

బెజ్జంకి,మార్చి15: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కొన్ని గ్రామాల్లో మహిళా రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం మారడం లేదని విద్యావంతులు, మహిళా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికైన మహిళా సర్పం చ్ల స్థానంలో వారి భర్తలే అధికారాలను వినియోగిస్తూ, ప్రజలు కూడా వారినే సర్పంచ్ అని పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అం టున్నారు.

దీనివల్ల మహిళా రిజర్వేషన్ అసలు లక్ష్యం నెరవేరడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళలకు అధికారాలు ఇచ్చినా సమాజంలో ఉన్న పాత అ భిప్రాయాలు మారకపోతే మహిళా నాయకత్వానికి పూర్తి స్థాయి గుర్తింపు రాదని చెబు తున్నారు.ఇందులోనే మహిళా సర్పంచ్ల పా త్ర చాలా చోట్ల సంతకాలకు, ఫోటోలకే పరిమితం అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రామ అభివృద్ధి నిర్ణయాలు, అధి కారులతో మాట ముచ్చట్లు కూడా చాలా సందర్భాల్లో సర్పంచ్ భర్తలతోనే జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా మహిళా వార్డు సభ్యుల పరిస్థితి కూడా చాలా చోట్ల ఇదే విధంగా ఉందని అంటున్నారు. వార్డు సభ్యుల స్థానంలో వారి కుటుంబ సభ్యులే వ్యవహారాలు చూసే పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మండలంలో 24 గ్రామ పంచాయతీ లకు 13 మంది మహిళా సర్పంచ్ లు ఎన్నికైనారు.

ఇందులోభూమి పూజ ప్రారంభోత్స వం లాంటి కార్యక్రమంలో భార్య గునపం, భర్త పారా పట్టుకొని దిగటం, ప్రక్కన కొన్ని సందర్భ లలో అధికారులు కూడా ఫోటోలు దిగడం,వంటి పోటోలు చూసిన ప్రజలు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, మహి ళలకు ఇచ్చిన హక్కులు నిజంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యావంతు లు మరియు సామాజిక వేత్తలు కోరుతున్నారు. మహిళలు స్వయంగా బాధ్యతలు చేపట్టి నాయకత్వం వహించే పరిస్థితి రావాలంటే ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు .