27 June, 2026 | 4:41 PM

ఈసీఐ నెట్టును ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి..

27-06-2026 03:39 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సర్ కార్యక్రమంలో  2002 ఓటర్ల జాబితా కొరకు ప్రతి ఒక్కరూ ఈసీఐ నెట్టును డౌన్లోడ్ చేసుకుంటే  2002 ఓటర్ల జాబితా  ప్రతి ఓటరు కు అందుబాటులోకి వస్తుందని  ఉట్నూర్ ఆర్డీవో  మోహన్ సింగ్ అన్నారు. శనివారం ఉట్నూర్, ఇంద్రవెల్లి  మండలాల పరిధిలోని పలు  పోలింగ్ కేంద్రాల పరిధిలోని బి ఎల్ ఓల  ఎన్యమరేషన్  ఫారం లను ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన  ఓటర్లతోపాటు  బి ఎల్ ఓ లకు  సూచనలు చేస్తూ ఈసీఐ నెట్టును డౌన్లోడ్ చేసుకుంటే  2002 ఓటర్ల జాబితా  అందుబాటులో ఉంటుందని  అన్నారు. సర్ కార్యక్రమంలో పంపిణీ చేస్తున్న ఫారంలను  జాగ్రత్త గా రాసే విధంగా  ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఓటర్ కు  ఫారం ను అందజేసి  రిజిస్టర్ లో వారి సంతకాలు తీసుకోవాలని  అన్నారు. ఆయన వెంట తహసిల్దార్  ప్రవీణ్ కుమార్, బి ఎల్ వో లు  పాల్గొన్నారు.