20 March, 2026 | 11:44 AM

యుద్ధ మేఘాలు దేశ దరిదాపుల్లోకి రావు

20-03-2026 12:00 AM
  1. పంటలు బాగా పండుతాయి
  2. బీజేపీ కార్యాలయంలో పండితుల పంచాంగ పఠనం

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): దేశ భద్రత పటిష్టంగా ఉండటంతో యుద్ధ మేఘాలు దేశ దరిదాపుల్లోకి రాకపోవచ్చని ప్రముఖ పండితులు సూర్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవని, ఇది ప్రజలకు ఊరటనిచ్చే అంశమని వివరించారు. దేశ భద్రత, విద్య, వ్యవసాయంరంగాల్లో అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపా రు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన ఉగాది వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మూర్తి పంచాంగ పఠనంచేశారు. జాతీయ విద్యా విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే సూచనలున్నాయని, విద్యారంగంలో మా ర్పులు చోటుచేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. మహిళలకు అధికారాలు పెరిగే పరి స్థితులు కనిపిస్తున్నాయని, సామాజికంగా మహిళల పాత్ర మరింత బలపడు తుందని తెలిపారు.

వ్యవసాయ రంగంలో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని, రైతులకు అనుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. నాలుగు గ్రహణాలు సంభవించే అవకాశమున్నప్పటికినీ వాటిని పాటించాల్సిన అవ సరంలేదన్నారు. యమునా నదికి పుష్కరా లు ఉండే అవకాశముందని, దేశాభివృద్ధికి ఈ ఏడాది అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించారు.