20 July, 2026 | 6:53 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

అందెశ్రీ పేరుతో సీఎం రాజకీయాలు మానుకోవాలి

20-07-2026 12:33 AM

బీఆర్‌ఎస్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి

ఘట్కేసర్, జూలై 19 (విజయక్రాంతి): ప్రజా కవి అందేశ్రీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేయడం మానుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ లో అందెశ్రీ జయంతి సందర్భంగా  సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బిఆర్‌ఎస్ పార్టీని విమర్శించిన రేవంత్ రెడ్డి నికృష్ట బుద్ధిని ప్రజలకు తెలియజేయడానికి ఘట్ కేసర్ పట్టణంలోని బంధన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో బిఆర్‌ఎస్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి, పీ ర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థా యిలో విమర్శలు గుప్పించారు.

ముఖ్యమం త్రి స్థాయిలో ఉండి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి అందెశ్రీ చేసిన సేవలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని పేర్కొ న్నారు. అందెశ్రీ సమాధి సాక్షిగా తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు, సాగునీరు, ధాన్యం కొనుగోలు వంటి అంశా ల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం వేలాది టీచర్, గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం తాము ఇచ్చిన నియామకాలను తమ ఘనతగా ప్రచారం చేసుకుం టోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతుల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ వర్గాల కోసం ఎంత ఖ ర్చు చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ప్రజలంతా కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ లు పలువుల మాధవరెడ్డి, రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంక టరెడ్డి, బండారి ఆంజనేయులుగౌడ్, బేతాళ నర్సింగరావు, నాయకులు నాగులపల్లి రమే ష్, శేఖర్, బద్దం జగన్మోహన్ రెడ్డి, లింగస్వా మి, లక్ష్మారెడ్డి, మంకయ్య, శ్రీనివాస్, యాదగిరి, పోత్నకని మల్లికార్జునరాజు, పాముల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.