మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి
పిఎస్ లో ఫిర్యాదు చేసిన తండ్రి
జవహర్ నగర్,(విజయక్రాంతి): మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్ల కారు అదుపుతప్పి ఇంటి ముందు ఉన్న వాలును ఢీకొని కారు బోల్తా పడడం వల్ల యువకుడు మరణించిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం.... వెల్లంగుల వరుణ్ ( 22) తన స్నేహితులను కలవడానికి ఈనెల 19వ తేదీన సాయంత్రం సైనిక్ పురికి వెళ్లగా అనంతరం 20వ తేదీ ఉదయం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు వరుణ్ తన స్నేహితులతో కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా యాప్రాల్ లోని ఓం శ్రీ సిగ్నైట్ అపార్ట్మెంట్ సమీపంలో అతివేగంగా కారును నడపడం వల్ల కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిముందు గోడ వాలును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వరుణ్ కు తీవ్ర గాయాలు కాగా కారులో ఉన్న వరుణ్ స్నేహితులు అలీ, అరుణ్ లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు వరుణ్ ను అతని స్నేహితులు మరో కారులో చికిత్స నిమిత్తం మిలటరీ హాస్పిటల్ కు తరలిస్తుండగా వరుణ్ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు వరుణ్ తండ్రి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






