21 May, 2026 | 2:39 AM

సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

21-05-2026 12:49 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మే20(విజయ క్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సిఎంఆర్‌ఎఫ్ నుండి మంజూరైన చెక్కులను నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే తన నివాసంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారు సి ఎం ఆర్ ఎఫ్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బడే నాగజ్యోతి, గోలేటి సర్పంచ్ అజ్మిరా బాబురావు,మాజీ సర్పంచ్ బానోతు బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.