21 May, 2026 | 2:19 AM

ఉపాధి కూలీలు వడదెబ్బకు జాగ్రత్తలు తీసుకోవాలి

21-05-2026 12:41 AM

జుక్కల్, మే 20 (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎండాకాలంలో ఉపాధి హామీ కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూలీలకు వివరించారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఉపాధి హామీ పని ప్రదేశానికి చేరుకొని పని సమయంలో ప్రతి ఒక్కరూ ఎండ నుండి రక్షణకై కాటన్ టవల్ తలకు కట్టుకోవాలని అన్నారు. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల పౌడర్ నీటిలో కలుపుకొని తరచూ నీరు ఎక్కువ తాగాలని సూచించారు. వడదెబ్బల బారి నుండి తప్పించుకునేందుకు  సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ బి.అనిల్ కుమార్, ఫీల్ అసిస్టెంట్ బి.రాజు, వార్డు సభ్యులు నాగనాథ్, గ్రామస్థులు పాల్గొన్నారు.