8 July, 2026 | 5:05 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి

29-11-2025 06:23 PM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీలోని ఐబీ గెస్ట్ హౌస్ వద్ద లక్షెట్టిపేట్, హాజీపూర్, దండేపల్లి మండలాల 61 సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించినట్లు పాత్రికేయుల సమావేశం మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... నా ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

వైద్యపరమైన సహాయ సహకారాలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మంచిర్యాల నియోజకవర్గం ఉండేలా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలారా రానున్న సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుద్దామని తెలిపారు. మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చదువుతున్న పాల్గొన్నారు.