పనిచేసే కార్యకర్తలనే కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కిస్తుంది
వనపర్తి, మార్చి 10 ( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన నిక్సాన కార్యకర్తకు సముచిత గౌ రవం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి లు అన్నారు.
టీపీపీసీ అధిష్టానం ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నుకోన్నున్న మండల అధ్యక్షుల కార్యవర్గానికి సంబంధించిన మంగళవారం పెద్ద మందడి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి పెద్దపీఠం వేయబోతున్నట్లు తెలిపారు. మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బూతు అధ్యక్షులకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించనుందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చిన్న పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా, సమాన అవకాశాలు ఇవ్వడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటి నుంచి గతంలో పదవులు తీసుకుని పనిచేయకపోతే, ఎలాగోలాగా నెట్టుకొచ్చే వాళ్ళం.. గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు ఉండదని, అందుకోసం ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో గ్రామస్థాయిలో ప్రక్షాళన చేయాలన్న ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పునర్నిర్మాణంలో భాగంగా దిశా నిర్దేశం చేస్తున్నారని గుర్తు చేశారు.
నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష కార్యవర్గానికి త్వరలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని, పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తే.. స్పందించి వెంటనే తగిన రీతిలో సమాధానం చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ నందిమల్ల యాదయ్య, మాజీ డిసిసి అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మొగిలి సత్యారెడ్డి, సత్యారెడ్డి, కోట్ల రవి, మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు తిరుపతయ్య, ఎంపిపి శంకర్, గోవర్ధన్ సాగర్, జిల్లా యూత్ అధ్యక్షులు ఆదిత్య, పాండు సాగర్, సర్పంచులు, మండల పార్టీ నాయకులు పెంటన్న, కార్యకర్తలు , మహిళాలు తదితరులు పాల్గొన్నారు.




