10 April, 2026 | 1:51 AM

ప్రతి పక్షాలకు కౌంటర్ కింగ్.. అసెంబ్లీ నుంచి గ్రామాల వరకు ‘ఆది’దూకుడు

10-04-2026 12:16 AM

బీసీ వర్గాల ఆశగా ఎదుగుతున్న ఆది శ్రీనివాస్ 

సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకమైన సైనికుడు ‘ఆది’

మంత్రి పదవి రేసులో  ఆది పేరు ?

వేములవాడ, ఏప్రిల్ 9,(విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల వేగంగా ఎదుగుతున్న నాయకులలో ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన వాయి స్గా మాత్రమే కాకుండా, రాజకీయంగా చురుకైన వ్యూహకర్తగా, ప్రతిపక్షాలపై పదునైన దాడి చేసే నేతగా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.అసెంబ్లీ నుంచి సీఎల్పీ సమావేశాల వరకు ఎక్కడైనా ఆది శ్రీనివాస్ తన మాటలతోనే కాకుండా, విషయంపై పట్టు చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను కేవలం ఖండించడం మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ఆయన శైలి.ప్రతి అంశంపై లోతైన అవగాహనతో, తక్షణ స్పందన ఇవ్వగలగడం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన వక్తగా మారారు.గాంధీభవన్ వేదికగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్, బీజేపీ నేతల ఆరోపణలను ఆధారాలతో ఖండించడం ఆయనకు అలవాటుగా మారింది.ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే  గ్రామీణ పర్యటనల్లో కూడా అక్కడికక్కడే వీడియోలు విడుదల చేసి ప్రతిపక్షాలపై కౌంటర్ ఇవ్వడం.

ఈ డిజిటల్ అప్రోచ్ ఆయనకు యువతలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆది శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ప్రభుత్వ పనితీరును వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సాక్ష్యాలతో తిప్పికొట్టడం ద్వారా ఆయన విశ్వసనీయతను పెంచుకున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు వచ్చినా వెంటనే స్పందిస్తూ ఆయనకు బలమైన అండగా నిలుస్తున్నారు.

పార్టీ విధానాలను కచ్చితంగా అమలు చేయడంలో, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆది శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం కు అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ నేతగా ఆయన పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం తీసుకొచ్చిన నాయకుడిగా ఆది శ్రీనివాస్ నిలుస్తున్నారు. కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి, ప్రాజెక్టులను గ్రౌండ్ లెవల్లో అమలు చేయడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.ప్రత్యేకంగా వేములవాడ పట్టణంలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని స్థానిక వ్యాపారుల ఒత్తిడుల మధ్య కూడా సమన్వయంతో ప్రారంభించడం ఆయన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది.

అలాగే రాజన్న ఆలయ అభివృద్ధికి భారీ నిధులు తీసుకురావడం ద్వారా ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. బీసీ వర్గాలకు బలమైన ప్రతినిధిగా ఆయన ఎదుగుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఇది భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్రను మరింత బలపరచే అంశంగా మారే అవకాశం ఉంది.ఆది శ్రీనివాస్ పేరు మంత్రి పదవి కోసం బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హైకమాండ్కు ఆయన పేరును సూచించినట్టు ప్రచారం జరుగుతోంది.