10 April, 2026 | 1:52 AM

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ

10-04-2026 12:17 AM

జడ్చర్ల, ఏప్రిల్ 9 : మండలం బండమీదిపల్లి గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ భవనం నిర్మాణం ద్వారా గ్రామంలోని మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు చేపట్టడానికి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక స్థిరమైన వేదిక లభించనుంది.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.మహిళల సాధికారతకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందనిగ్రామ సర్పంచ్ సత్యమోల పాండు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నావారు ఉప సర్పంచ్ దుర్వి నాగలక్ష్మి మల్లేష్, వార్డ్ సభ్యులు కొత్తోల చిన్న పెంటయ్య, చిట్యాల సురేష్, చిట్యాల మహేష్, శివకుమార్ మరియు గ్రామ పెద్దలు,ప్రజలు,యువకులు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, మహిళ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.